మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (16:47 IST)

ఇస్మార్ట్ జోడీలో ఎంట్రీ ఇస్తోన్న జ్యోతక్క.. 12మంది సెలబ్రిటీ కపుల్స్

బిగ్ బాస్ షోలోనే ''నా సోగ్గాడు బంగారం'' అంటూ తన భర్త గంగూలీని పరిచయం చేసిన జ్యోతక్క ఈసారి మరో రియాలిటీ షోకి "ఇస్మార్ట్" జోడీగా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజుల్లో బుల్లితెర, వెండితెర అనే తేడానే లేదు. ఇంకా చెప్పాలంటే.. రోజూ కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ.. నిత్యం అలరించే బుల్లితెర సెలెబ్రిటీస్ గురించి అందరూ తెలుసుకోవాలనే ఆత్రుత పడతారు. ఇలాంటి వారి కోసం మరో అల్టిమేట్ రియాల్టీ షో రానుంది. 
 
సుమారు 17 మందితో వంద రోజుల పాటు.. బిగ్‌బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షోను పరిచయం చేసిన స్టార్ మా ప్రస్తుతం 12 మంది సెలబ్రెటీ కపుల్స్‌తో.. దాదాపు 18 వారాల పాటు ఓ గేమ్ షో నిర్వహించనుంది. 
 
బుల్లితెర యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ గేమ్ షో.. 18 వారాల పాటు.. 12 సెలబ్రెటీ జంటలకు బిగ్గెస్ట్ ఫైట్‌ ఉండబోతుందని వారి మాటలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే అర్థమవుతోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇందులో బిగ్ బాస్ జ్యోతక్కతో పాటు పలు బుల్లి తెర సెలెబ్రిటీలు పాలుపంచుకోనున్నారు.