గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (14:33 IST)

భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ప్లాన్.. చెన్నైలో ఎనిమిది మంది అరెస్ట్

భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ అనే బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్‌కి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. ఐఎస్‌ఐ మోనెటరింగ్‌లో భారత్‌లో ఉగ్ర దాడులకు జరిపేందుకు బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలకి శిక్షణ ఇస్తున్నటు తెలుస్తోంది. 
 
వీరు శిక్షణ పొందడం కోసం సౌదీ అరేబియా, మలేషియా, యూకే, పాకిస్తాన్‌లోని గ్రూపుల నుంచి ఐఎస్‌ఐ నిధులు అందుకున్నట్లు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇప్పటికే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద జెఎంబికి రూ .1 కోటి ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
ఓ కీలక మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఐఎస్ఐ తన దుర్మార్గపు మిషన్ కోసం బంగ్లాదేశ్, కాక్స్ బజార్లో ఉంటున్న దాదాపు 40 మంది రోహింగ్యాలను నియమించింది. బంగ్లాదేశ్‌లో అత్యంత ఘోరమైన టెర్రర్ గ్రూపు అయిన జెఎమ్‌బి ఈ శిక్షణ ఇస్తోంది.
 
మరోవైపు తమిళనాడు పోలీసులు జిహాదీ ఉగ్రవాదుల ముఠా గుట్టు రట్టు చేశారు. ఎనిమిది మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు తమిళనాడుకు చెందిన వారు కాగా, ముగ్గురు బెంగళూరుకు చెందినవారు. వారి వద్దనుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడానికి ఈ ముఠా కుట్ర పన్నినట్లు ఐంటలిజెన్స్ పేర్కొంది.