బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (12:24 IST)

#IranvsUSA.. భారతీయులను ఇరాన్‌కు పంపకండి..

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ నివసించే భారతీయుల కోసం బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతీయులు క్షేమంగా వున్నట్లు  ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ కు చెందిన దౌత్యవేత్త ఒకరు హామీ ఇచ్చారు. 
 
ఇరాన్‌లోని భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని సురక్షితంగానే ఉన్నారని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా.. ఇరాన్, ఇరాక్‌లలోని చమురు క్షేత్రాల్లో, ఇతరత్రా పనుల ద్వారా జీవనోపాధి పొందేందుకు అనేక మంది భారతీయులు వెళ్ళి ఉన్నారు. 
 
ఇరాక్‌లో దాదాపు 25 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా. వారంతా క్షేమంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ దౌత్య వేత్తతో పాటు ఇరాన్ ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ఇప్పటికే ఇరాన్‌లో వున్న భారతీయులు క్షేమంగా వున్నారని, కానీ ఇకపై ఇరాన్‌కు కొత్త వారిని పంపవద్దంటూ ఆ దేశ  రాయబార కార్యాలయం పేర్కొంది.