మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (18:51 IST)

అంతిమయాత్రలో తొక్కిసలాట... 35 మంది మృత్యువాత

ఇరాన్ సైనిక దళానికి చెందిన అగ్రనేత ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా డ్రోన్ల దాడిలో సులేమానీ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఈయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 
 
అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. తమ అభిమాన వ్యక్తి పార్థివ దేహాన్ని చూసేందుకురావడంతో జనం ఒక్కసారిగా తోసుకునిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మరణించగా, 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఇరాన్ టీవీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ సులేమానీ సహా మరో ఐదుగురు అధికారులను డ్రోన్‌ దాడితో అమెరికా సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. తమ అభిమాన అధికారిని అమెరికా హత్య చేయడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే.