గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (18:22 IST)

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై అందుబాటులోకి ఉచితంగా వైఫై వీడియో కాల్స్

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ.. కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌ను ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ వైఫై వాయిస్, వీడియో కాల్స్ క్లియర్‌గా వుంటాయని.. ఇందుకు అదనపు చెల్లింపు అవసరం లేదని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సదుపాయం దేశ వ్యాప్తంగా వుంటాయని.. ప్రస్తుతానికి 150 హ్యాండ్ సెట్లకు అందుబాటులో వుంటుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయాన్ని ముంబైలో జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను గుర్తించే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చామన్నారు. సగటు జియో వినియోగదారుడు నెలకు 900 నిమిషాల వాయిస్ కాల్స్ చేస్తున్నట్టు గుర్తించామని.. కస్టమర్ల సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించాం. ఇప్పటికే వోల్ట్ నెట్‌వర్క్‌ను మొదటిసారి ఇండియాకు పరిచయం చేసిన ఘనత కూడా జియోదేనని ఆకాష్ అంబానీ తెలిపారు. 
 
జియో వైఫై కాలింగ్ సదుపాయాన్ని విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని.. దేశ వ్యాప్తంగా జనవరి 7వ తేదీ నుంచి 16వ తేదీలోపు పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని జియో వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. ఇకపోతే.. స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే ఈ సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీ ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు Jio.com/wificalling వెబ్‌సైట్‌‌ను సంప్రదించవచ్చు.