సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (15:30 IST)

వ్యోమగాముల కోసం ఆహారపదార్థాలు తయారు చేసిన డీఎఫ్‌ఆర్ఎల్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో త్వరలో గగన్‌యాన్ పేరిట అంతరిక్షయాత్రను చేపట్టనుంది. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. వీరికి రష్యాలో శిక్షణ ఇస్తోంది. రోదసీలో ఉండే వాతావరణ పరిస్థితులు, ఎలా ఉండాలి, తదితర అంశాలపై ఈ శిక్షణ సాగుతోంది. 
 
అయితే, ఈ గగన్‌యాన్ కోసం రోదసీలోకి వెళ్లే వ్యోమగాముల కోసం బెంగుళూరులోని డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబోరేటరిలో ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే ఇండ్లీ నుంచి వెజ్ పులావ్ వంటి ఆహారపదార్థాలను సిద్ధం చేశారు. ఇవి ఎక్కువకాలం నిల్వవుండేలా ప్రత్యేక ప్యాకింగ్‌లో సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ పరిశోధనాశాలలో తయారు చేసిన ఆహారపదార్థాలను పరిశీలిస్తే, ఇడ్లీ సాంబార్ మొదలుకొని వెజిటబుల్ పులావ్ వరకు దాదాపు 30 రకాలు వంటకాలున్నాయి. ముఖ్యంగా, ఎగ్‌రోల్స్, వెజ్‌రోల్స్, ఉప్మా, హల్వా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను వేడి చేసుకునేందుకు ప్రత్యేక ఇండక్షన్ తరహా హీటర్ కూడా రీసెర్చ్ ల్యాబ్ తయారు చేసింది. వీటిని కూడా రోదసీలోకి వ్యోమగాములు తమ వెంట తీసుకెళ్లనున్నారు.