సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:11 IST)

కరోనాతో చైనాకు చిన్నపాటి ఊరట.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందట..

కరోనా నుంచి చైనాకు చిన్నపాటి ఊరట లభించింది. కోవిడ్ దెబ్బకు బుధవారం మాత్రం 114 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క హుబెయ్ ఫ్రావిన్స్‌లో మాత్రం 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 2,118కి చేరింది. కోవిడ్‌ ప్రభావం హెబెయ్‌, వూహాన్‌లోనే అత్యధికంగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇలా కోవిడ్-19 బారినపడి విలవిల్లాడుతున్న చైనాకు కాస్త ఉపశమనం లభించింది. కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఈ విషయాన్ని చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ వ్లెడించింది. బుధవారం మాత్రం 394 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్తున్నారు. ఇకపోతే చైనాలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 16,155 మంది కోలుకున్నారు.