గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:40 IST)

ఆకాశాన్ని అంటుతోన్న బంగారం ధరలు.. రికార్డ్

బంగారం ధర పెరిగిపోయింది. కరోనా ఎఫెక్ట్ బంగారంపై కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు బంగారం ధరపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 42,462కు చేరింది. 
 
మంగళవారం నాటితో పోలిస్తే, బుధవారం ఒక్కరోజే ధర రూ. 468 పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలో పెరిగిపోతోంది. కిలో వెండి ధర రూ. 48,652కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో బంగారం ధర రూ. 43 వేలను కూడా దాటేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పడం గమనార్హం.
 
కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు డీలా పడిన తరుణంలో తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ అత్యధిక రాబడులను ఇస్తుందని మదుపరులు అంచనా వేస్తుండటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కావడం ద్వారా కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఫలితంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.