గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (17:04 IST)

నయనతార మాజీ ప్రియుడిని పెళ్లాడనున్న చెన్నై చంద్రం?? (Video)

కోలీవుడ్ యువ హీరో శింబు. గతంలో ఈయన హీరోయిన్ నయనతార ప్రియుడు. పెళ్లి వరకు వచ్చిన వీరి ప్రేమ, వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి శింబు ఒంటరిగా ఉంటున్నాడు. కానీ, నయనతార మాత్రం ప్రముఖ కొరియాగ్రాఫర్ ప్రభుదేవాతో కొంతకాలం ప్రేమాయణం జరిపింది. ఆ తర్వాత ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలోపడింది. 
 
అయితే, ఇపుడు నయనతార మాజీ ప్రియుడిగా మిగిలిపోయిన శింబు.. హీరోయిన్ త్రిషను పెళ్లాడనున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో త్రిష పెళ్లి కూడా పెళ్లి పీటల వరకు ఆగిపోయింది కూడా. సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. 
 
ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి. ఆ నటుడి విషయంలో స్పందించిన త్రిష.. అతను కేవలం తనకు ప్రాణ స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. మరి ఈ తరుణంలో అసలు త్రిషకు పెళ్లి అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. అయితే తాజాగా కోలీవుడ్‌లో త్రిష పెళ్లి విషయమై ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
 
వివాదాల హీరో శింబుని త్రిష పెళ్లిచేసుకోబోతోందట. శింబు విషయానికి వస్తే.. పెళ్లి విషయంలో ఆయనది కూడా సేమ్ రూటే. నయనతారతో ప్రేమాయణం తర్వాత హన్సికతో ప్రేమ, పెళ్లి వంటి వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలోనే వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత హన్సిక కామ్‌గా సినిమాలు చేసుకుంటుంది. 
 
మరి ఇలాంటి తరుణంలో త్రిషతో శింబు పెళ్లి అనే వార్తలు రావడం నిజంగా సంచలన విషయమే. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం ఈ టాపిక్‌పై హాట్ హాట్ కథనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శింబు, త్రిష కలిసి 'విన్నైతాండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేసావే') చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీ సీక్వెల్‌లో కూడా వీరు నటించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది.