అది వాస్తవం కాదు.. సినిమా తీయడం కాదు.. పబ్లిసిటీ ముఖ్యం
చిన్న సినిమాలకు థియేటర్‌లు దొరకడం లేదనేది వాస్తవం కాదనీ... అందులో 40 శాతమే నిజమని.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. చాలా మంది నిర్మాతలు సినిమాలు తీస్తూ రూ.కోట్లు ఖర్చు పెడుతు
చిన్న సినిమాలకు థియేటర్‌లు దొరకడం లేదనేది వాస్తవం కాదనీ... అందులో 40 శాతమే నిజమని.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. చాలా మంది నిర్మాతలు సినిమాలు తీస్తూ రూ.కోట్లు ఖర్చు పెడుతుంటారు.. కానీ.. పబ్లిసిటీకి వచ్చేసరికి వెనకడుగు వేస్తుంటారు. అసలు ఖర్చు చేయాల్సింది ఇక్కడే. దాన్ని మర్చిపోతున్నారు. చాలా మంది ఈ విషయంలో తప్పటడుగు వేస్తూ.. అప్పటికే ఎక్కువగా ఖర్చు చేశామని చెబుతుంటారు. అది కరెక్ట్ కాదని.. ఆయన అన్నారు.
'పెళ్లి చూపులు' సినిమాను కోటి రూపాయలతో తీశారు. అది ఇప్పుడు రూ.14 కోట్లను రాబడుతుంది. ఈ విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు. నేను దాదాపు 99 సినిమాలు తీశాను. విడుదలకు ముందు ఎటువంటి టెన్షన్ పడకుండా.. సరైన వారి సలహాలతో ముందుకు సాగాలని హితవు పలికారు. మరో నిర్మాత ఆర్.కె. గౌడ్ కూడా మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రలోని థియేటర్లను చిన్నసినిమాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూస్తానని అన్నారు. ప్రణాళికగా సినిమాలు తీయాలని కొత్తగా వచ్చేవారికి సూచించారు.