శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 3 మే 2017 (12:33 IST)

తెలుగు సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా?

తెలుగు సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సప్తమాత్రిక సీరియల్‌లో నటించిన ప్రదీప్.. సప్తపది, ఆరుగురు పతివ్రతలు వంటి సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే హైదరాబ

తెలుగు సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సప్తమాత్రిక సీరియల్‌లో నటించిన ప్రదీప్.. సప్తపది, ఆరుగురు పతివ్రతలు వంటి సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే హైదరాబాదులోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ప్రదీప్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ రాత్రంతా తన కుటుంబీకులతో హ్యాపీగా గడిపిన ప్రదీప్ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక గల కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 
వివాహం జరిగి ఎన్నో ఏళ్లు గడవని తరుణంలో ప్రదీప్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కుటుంబీకులు మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ప్రదీప్ మాతో సంతోషంగా ఉన్నాడని చెప్తున్నారు. దీని వెనుక వేరేదో కారణముందని సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.