ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (15:15 IST)

ఆక్స్‌ఫర్డ్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజ్‌ అంబాసిడర్‌గా ఉపాసన

Upasana Ramcharan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని పరోపకారి, వ్యాపారవేత్త. ఆమె ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైంది. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆమెకున్న దృఢ నిబద్ధత కోసం ఈ అంబాసిడర్ పదవి ఆమెను వరించింది.
 
ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె వెల్‌నెస్ ప్లాట్‌ఫారమ్.. యూఆర్‌లైఫ్ వ్యవస్థాపకురాలు కూడా. ఆరోగ్య సంరక్షణ, దాతృత్వంలో ఆమె చేసిన కృషికి ఆమె అనేక అవార్డులను గెలుచుకుంది.
 
ఉపాసన పర్యావరణ పరిరక్షణ కోసం WWF-India వంటి సంస్థలతో కలిసి పని చేస్తోంది. ఆమె తాజాగా ఆక్స్‌ఫర్డ్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజ్‌కి అంబాసిడర్‌గా ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తోంది. వాతావరణ మార్పులకు పరిష్కారాలు కనుగొనేలా యువతలో స్ఫూర్తి నింపాలని పేర్కొంది.