గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (13:18 IST)

పైరసీదారులకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'ఉరి' మూవీ యూనిట్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద సంస్థలపై భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఉరి". ఈ మెరుపు దాడుల నేపథ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకురాగా, ప్రస్తుతం ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రానికి కూడా పైరసీ బెడద పట్టుకుంది.
 
ఈ విషయం ముందే తెలుసుకున్న మూవీ మేకర్స్.. పైరసీదారులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఇలాగే 'ఉరి' సినిమాకు చెందిన 3.2 జీబీ ఫైల్‌ను ఓ వ్యక్తి డౌన్‌లోడ్ చేసి షాక్ తిన్నాడు. ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడగా.. మూవీ మధ్యలో లీడ్ రోల్స్‌లో కనిపించే విక్కీ కౌశల్, యామీ గౌతమ్.. పాకిస్థాన్‌లో చేయబోయే సర్జికల్ స్ట్రైక్స్ గురించి సీరియస్‌గా చర్చిస్తుంటారు. 
 
వెంటనే వాళ్లు మనవైపు చూసి.. మేం పాకిస్థాన్‌లోకి వాళ్లకు తెలియకుండా ఎలా వెళ్తామో.. మీ మొబైల్‌లోకి కూడా మీకు తెలియకుండానే వచ్చాం.. ఇలా దొంగచాటుగా మూవీని డౌన్‌లోడ్ చేసి చూడకుండా.. థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ వాళ్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయాన్ని మూవీని డౌన్‌లోడ్ చేసిన వెల్లడించాడు. మొత్తంమీద 'ఉరి' చిత్రం పైరసీదారులకు తేరుకోలేని షాకిచ్చిందని చెప్పొచ్చు.