శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (18:26 IST)

జెర్సీ చిత్రం ప్ర‌తి ఒక్క‌రికీ జీవిత పాఠం - విక్ట‌రీ వెంక‌టేష్

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జెర్సీ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. నాని స‌ర‌స‌న శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టించారు. ఈ నెల 19న జెర్సీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. 
 
ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ మాట్లాడుతూ... క్రికెట్‌ ఇష్టం కాబట్టే ఇక్కడికి రాలేదు. చాలా జెన్యూన్‌గా, ప్రేమగా ఇక్కడికి వచ్చాను. ‘జెర్సీ’ రూమ్‌లో ఫస్ట్ లుక్‌ వచ్చినప్పుడే చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను. గౌతమ్‌ ఈ సినిమాలో ఏం చూపించాలనుకున్నారో క్లారిటీగా అదే చూపించారు. ట్రైలర్‌ చూశాక మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది. జెన్యూన్‌ సినిమాలు రేర్‌గా వస్తాయి. నానిని ఇలాంటి సినిమాలో చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి పాత్రల్లో నటించేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఇన్వాల్వ్‌ అవుతుంటాం. అందుకే ట్రైలర్‌ చూడగానే ఈ తరహా సినిమాలు స్ఫూర్తిగా అనిపిస్తాయి. 
 
ప్రతి ఒక్కరూ హీరో పాత్ర చూసి ఇన్‌స్పయిర్‌ అవుతారు. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్‌ అవుతుంటారు. అలాంటప్పుడు జీవితంలో మనం వదిలేయకూడదు. గట్టిగా ప్రయత్నించి సక్సెస్‌ సాధించాలని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, జీవిత పాఠం అని అర్థం చేసుకుంటాం. సినిమా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నిర్మాతలు నాకు చాలా మంచి మిత్రులు. దర్శకుడికి కంగ్రాట్స్‌. నానిని చూస్తే గర్వంగా ఉంటుంది. తను మనకున్న నేచురల్‌ స్టార్‌ అన్నారు.