వెంకీ - చైతుల ''వెంకీ మామ'' ప్రారంభం..!
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ చైతన్యతో సినిమా తీయాలని ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఇక ఈ సెన్సేషనల్ మల్టీస్
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ చైతన్యతో సినిమా తీయాలని ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఇక ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ రామానాయుడు స్టూడియోలో సినీ, రాజకీయ నాయకుల ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వెంకటేష్ - నాగ చైతన్యలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా సురేష్ బాబు స్విచ్చాన్ చేసారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, వెంకీ సరసన నటించే హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సివుంది. గ్రామీణ నేపధ్యంతో సాగే ఈ చిత్రానికి జనార్థన మహర్షి కథ అందించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవంలో సురేష్ బాబు, దగ్గుబాటి రానా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభట్ల, కోన వెంకట్, డైరెక్టర్ బాబీ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.