సంబంధిత వార్తలు
- అమెజాన్: "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - 'ఫేక్' అంబాసిడర్లపై ట్విటర్లో విమర్శలు
- పిన్నితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడనీ చిన్నాన్న హత్య
- సైనికుడి భార్యతో అక్రమ సంబంధం... వీడియోలను నెట్లో పెట్టిన ప్రబుద్ధుడి భార్య
- ప్రతి పౌరుడూ నీతి నిజాయితీతో మెలగాలి : ఎంఏ షరీఫ్
- ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్ ద్వారా స్పందించిన డీజీపీ
ఆగిన షూటింగ్... వెంకీమామకు ఏమైంది.? ఇంతకీ ఏం జరిగింది...?
విక్టరీ వెంకటేశ్‌కి షూటింగ్‌లో చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం వెంకటేష్... నాగచైతన్యతో కలిసి నటిస్తోన్న చిత్రం 'వెంకీమామ'. డి.సురేశ్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. బాబీ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్‌లపై రామోజీఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
ఆ సందర్భంలో వెంకటేశ్ కాలు స్వల్పంగా బెణికింది. దీంతో యూనిట్ షూటింగ్‌ను నిలిపివేశారు. వెంకీ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు కొన్నిరోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.
దీంతో వెంకీ మామ సినిమా పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మొదలైంది. అయితే... చిత్ర యూనిట్ చెబుతున్న సమాచారం ప్రకారం... ఈ సినిమాని అనుకున్న తేదీకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
వెంకీ రెండు, మూడు రోజుల్లో షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ అవుతుంది. వచ్చే నెలలో మిగిలిన రెండు పాటలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది. దసరాకి "వెంకీమామ" రావడం ఖాయం అంటున్నారు. మరి... త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారేమో చూద్ధాం.
