ప్రతి పౌరుడూ నీతి నిజాయితీతో మెలగాలి : ఎంఏ షరీఫ్

ma shariff
ఎం| Last Updated: గురువారం, 15 ఆగస్టు 2019 (11:54 IST)
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ శాసనమండలి ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శాసనమండలి వద్ద జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మండలి ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడూ నీతి, నిజాయితీతో మెలగాలని సూచించారు. నాడు స్వాతంత్ర్య సాధన కోసం మహత్మాగాంధీజీ నేతృత్వంలో నాడు 95 వేల మంది బ్రిటీష్ కబంధ హస్తాల్లో బలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అమరులైన వారి పేర్లు ఉన్నాయని తెలిపారు. శిలాఫలకం మీద లేని వారి పేర్లు కూడా చాలా ఉన్నాయన్నారు. వాళ్ల త్యాగధన ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవమని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఫలాలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని తెలిపారు. అందరూ కలిసి మెలిసి ఐకమత్యంగా ఉండాలని, సోదరభావంతో మెలగాలని సూచించారు.

ఈ సందర్భంగా గురుజాడ వెంకట అప్పారావు దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన మాటలను గుర్తు చేశారు. ప్రతి ఒక్క మనిషి దేశాన్ని, మనిషిని గౌరవించుకోవాలని తెలిపారు. రాబోయే కాలంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండనుందని ధీమా వ్యక్తం చేశారు.

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్,
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :