మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:27 IST)

"ప‌ద్మ" పాత్ర‌లో ప్రేక్ష‌కుల గుండెల్లో విన్న‌ర్‌గా వెన్నెల కిషోర్‌

ఈ మధ్యకాలంలో కమెడియన్ వెన్నెల కిషోర్‌ హిలేరియస్‌గా నవ్వించిన చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. 'భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌', 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా', 'మ‌జ్ను' వంటి చిత్రాల్లో వెన్నెల కిష

ఈ మధ్యకాలంలో కమెడియన్ వెన్నెల కిషోర్‌ హిలేరియస్‌గా నవ్వించిన చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌గా నిలుస్తున్నాయి. 'భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌', 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా', 'మ‌జ్ను' వంటి చిత్రాల్లో వెన్నెల కిషోర్ త‌న‌దైనశైలిలో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విచారు. తనదైన డైలాగ్ పంచ్‌ల‌తో... తనదైన మాడ్యులేష‌‌‌న్స్‌తో కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యనటుడు వెన్నెల కిషోర్‌.
 
'విన్నర్' చిత్రంలోనూ ప‌ద్మ పాత్ర‌లో న‌వ్విస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన పాత్ర‌ల‌కి విభిన్నంగా దర్శకుడు గోపిచంద్ మలినేని మరో అద్భుతమైన కామెడీ పాత్రను రాశారు. ప‌ద్మ పాత్రలో కిషోర్ క‌డుపుబ్బ నవ్వించనున్నారు. 'విన్నర్' చిత్రంలో వ‌ద్మ క్యారెక్టర్ తప్పకుండా కొత్త‌గా ఉంటుంది అంతేకాదు న‌వ్వుల వ‌ర్షం కురిపిస్తుంది. 
 
సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అన‌గా ఈ శుక్ర‌వారం అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.