1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 మే 2016 (11:55 IST)

మీడియాపై విరుచుకుపడిన వేణుమాధవ్.. బుద్ధిలేని గాడిదలంటూ..?!

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మీడియాపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. మీడియాపై ఘాటుగా విమర్శలు చేశాడు. తన మరణంపై వచ్చిన వార్తలను బుద్ధిలేని గాడిదలు రాసిన రాతలేనని సీరియస్ అయ్యాడు. మీడియా తాను మృతిచెందినట్లు రాసిన రాతలపై త్వరలో తాను గవర్నర్ నరసింహన్‌ను కలుస్తానని తెలిపాడు. 
 
కాగా ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో పాటు కొన్ని వెబ్‌సైట్లలో టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవి మరణించినట్లు వచ్చిన వార్తలపై వేణుమాధవ్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసయాదవ్‌ని కోరాడు.