ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (10:18 IST)

విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం వేడుక

niraja, Hayawahini, nishanth, venkatesh
niraja, Hayawahini, nishanth, venkatesh
విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె  హవ్యవాహిని వివాహం వేడుక శుక్రవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. గత అక్టోబర్ లో హవ్యవాహిని, డాక్టర్ నిశాంత్  ఎంగేజ్ మెంట్ విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ తో సింపుల్ గా జరిగింది. అప్పటినుంచి పెండ్లి హైదరాబాద్ లో జరుగుతుందని ప్రకటించారు. కానీ ఎక్కడనేది క్లారిటీ లేదు. సినీరంగ ప్రముఖులతో బంధుమిత్రుల సమక్షంలో నిన్న రాత్రి స్టూడియోలో జరగడం విశేషం. 
 
Hayawahini, nishanth
Hayawahini, nishanth
కాగా, మీడియాకు పొటోలను పంపించి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలను చూసి సోషల్ మీడియాలో వెంకీ ఫ్యాన్స్, ఆడియన్స్ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. గత ఏడాది వెంకీ మొదటి కుమార్తె ఆశ్రిత వివాహం జరిగింది.ఇంకా మరో కుమార్తె  భావన, కుమారుడు అర్జున్ రామంత్ వున్నారు.