1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vijay Devarakonda Revealed about His Marriage

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం నావల్ల కాదుబాబోయ్ అంటున్న హీరో

'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంతో విజయ్ స్టార్ హీరో హోదాను దక్కించుకున్నారు. ఈ చిత్రం కలెక్షన్

Vijay Devarakonda
'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంతో విజయ్ స్టార్ హీరో హోదాను దక్కించుకున్నారు. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో విజయ్‌కు అనేక ఆఫర్లు వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో విజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతుంటే ఓ ప్రశ్న ఎదురైంది. 'లవ్ మ్యారెజ్' చేసుకుంటారా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా…? అనేది ఆ ప్రశ్న. అందుకు స్పందించిన ఆయన ఒకప్పుడు నేను 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడిని. కానీ, ఇపుడు 35 యేళ్ళకే కుదించాను. 
 
ఇక ఎప్పటికైనా ప్రేమపెళ్లినే చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లిన చేసుకోవడం నావల్ల కాదని తెగేసి చెప్పాడు. చెప్పుకొచ్చాడు. తెలంగాణ అమ్మాయినే చేసుకోవాలి, ఆంధ్ర అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనేం మాత్రం తనకు లేదన్నాడు. ప్రపంచంలో ఎక్కడ వున్నా తనకు కనెక్ట్ కాగలిగితే చాలని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హీరో కాదు.. బౌన్సర్... ఇద్దరు సోదరులకు కంచెలా....