మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:03 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి కాంబో మూవీ వార్త‌ల్లో నిజ‌మెంత‌..?

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో కెరీర్ ప్రారంభించి... పెళ్లి చూపులు సినిమాతో స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడ

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో  కెరీర్ ప్రారంభించి... పెళ్లి చూపులు సినిమాతో స‌క్స‌స్ సాధించి.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బాగా డిమాండ్ పెరిగింది. 10 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నార‌ట‌. కానీ... విజ‌య్ ప్ర‌జెంట్ ఫుల్ బిజీ. ఇదిలా ఉంటే... తాజాగా ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది.
 
అది ఏంటంటే.. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నాడ‌ని. అస‌లు నిజం ఏంటంటే.. ఓ నిర్మాత విజ‌య్ - పూరి కాంబినేష‌న్లో సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. విజ‌య్‌కి ఈ విష‌యం చెప్పార‌ట‌. అయితే.. త‌ను ప్ర‌స్తుతం ఓకే చెప్పిన సినిమాలు కంప్లీట్ కావడానికి రెండు సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. అందుచేత ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయిన త‌ర్వాత వ‌చ్చి క‌లుస్తాన‌ని చెప్పాడ‌ట‌. అది అస‌లు జ‌రిగింది. ఇది తెలియ‌క పూరి - విజ‌య్ సినిమా చేయ‌నున్నారు అంటూ ప్ర‌చారం చేస్తున్నారు.