మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 17 మే 2021 (12:51 IST)

`నల్లమల`లో నాజర్ ఏం చేస్తున్నాడు!

Nazar
అటవీ నేపథ్య చిత్రాల్లో సరికొత్త ప్రయత్నంగా తెరపైకి రాబోతోంది నల్లమల. నల్లమల అటవీ ప్రాంతంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రవి చరణ్. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు నాజర్. నల్లమల చిత్రంలో అసాధారణ మేథస్సు గల సైంటిస్ట్ గా నాజర్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాజర్ క్యారెక్టర్ డీటెయిల్స్ దర్శకుడు రవి చరణ్ వివరించారు.
 
దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ, ఇరాన్ దేశంలో నివసించే తెలుగువాడైన సైంటిస్ట్ పాత్రను నాజర్ పోషించారు. అతని మేధస్సు అపారమైనది. ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలన్నది నాజర్ పాత్ర లక్ష్యం. అందుకు తానేం తయారు చేయాలి అనేది నిరంతరం ఆలోచనలు చేస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా చెడుదా అనేది అతనికి అనవసరం. తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు నాజర్. అక్కడ అతనేం ప్రయోగాలు  చేశాడు. ఏం కనుగొన్నాడు.. ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది అనేది నల్లమల చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.
 
కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్, ఆర్ట్ : యాదగిరి, పి.ఆర్.వో : టి.మీడియా, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్