శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (11:51 IST)

పద్మావతిపై పరిపూర్ణానంద కామెంట్స్

పద్మావతి సినిమాపై వివాదం కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో పద్మావతి చరిత

పద్మావతి సినిమాపై వివాదం కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో పద్మావతి చరిత్రను వక్రీకరించారని. ఆమెపై అభ్యంతరకరమైన సన్నివేశాలను చిత్రీకరించారని రాజ్‌పుత్‌లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాకుండా ఈ సినిమాపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న వేళ.. పద్మావతి వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. రాణి పద్మావతి జీవితం ఒక చరిత్ర అన్నారు. అలాంటి చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. లేకపోతే, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. పద్మావతి జీవితం ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట.. చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, సినిమాలు తీయడం చేస్తున్నారని ''భావ ప్రకటనా స్వేచ్ఛ" పేరుతో "స్వేచ్ఛా భావ ప్రకటన" చేస్తున్నారని విమర్శించారు. ఇది సమాజానికి అంత మంచిది కాదన్నారు.  
 
మరోవైపు.. ఈ చిత్రంలో నటించిన బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునేకు బెదిరింపులు వచ్చిన తరుణంలో న‌వంబ‌ర్ 28 నుంచి 30వ తేదీ వ‌ర‌కు హైదరాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ స‌మ్మిట్‌కి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్ర‌త్యేక అతిథిగా విచ్చేస్తున్న ఈ మూడు రోజుల‌ స‌దస్సులో దాదాపు 53 అంశాల గురించి చ‌ర్చించ‌నున్నారు. అందులో భాగంగా 'హాలీవుడ్ టు నోలీవుడ్ టు బాలీవుడ్‌' అనే అంశం గురించిన చ‌ర్చ‌లో దీపికా పాల్గొనాల్సి ఉంది. కానీ దీపికా ఈ సదస్సుకు హాజరుకాకపోవడంతో మరో నటిని వెతికే పనిలో ఉన్నట్లు తెలంగాణ ఐటీ కార్యదర్శి జ‌యేశ్ రంజ‌న్ తెలిపారు.