‘నీలాంటోడు అడుగడుగునా ఉంటాడు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు’ అంటున్న సాయిధరమ్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విన్నర్’. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించారు. సంక్రాంతి సందర
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విన్నర్’. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఓ కీలకపాత్రలో నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఈ చిత్రం యూనిట్ విడుదల చేసింది.
ఈ చిత్రంలోని డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయి. హీరో సాయిధరమ్ చెప్పిన.. ‘నీలాంటోడు అడుగడుగునా ఉంటాడు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు’ అనే డైలాగ్‌తో పాటు ‘అదే డేట్.. అదే టైమ్.. అదే ప్లేస్.. అదే ట్రాక్.. అదే రేస్.. నేను రెడీ’ అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది.
కాగా, ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ టీజర్‌లో హాట్ యాంకర్ అనసూయ కూడా దర్శనమివ్వడం విశేషం.