1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. yash and ramcharan meet in behindwoods award function

యష్-చెర్రీ కలిసిన వేళ..

Yash
కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయి‌గా రఫ్పాడించిన యష్‌కు సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు లభించింది. బిహైండ్‌వుడ్స్ ఈ అవార్డుతో యష్‌ను సత్కరించింది. ఈ అవార్డును ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రాన్‌ ఈ అవార్డును యష్‌‌కు అందజేసాడు. 
 
ఈ ప్రోగ్రామ్‌కు రామ్ చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ‌తో పాటు మలయాళ ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోలందరు ఒకరినొకరు ఆప్యాయంగా  పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో యష్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య తమ సినిమాలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
 
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ''ఆర్ఆర్ఆర్'' సినిమా చేస్తున్నాడు. మరోవైపు యష్‌ హీరోగా నటించిన ''కేజీఎఫ్ 2'' సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మొత్తానికి రామ్ చరణ్. యష్‌ల కలయిక అటు శాండిల్ వుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
క‌ళ్యాణ్ రామ్.. ఏమో ఏమో ఏ గుండెల్లో.. పాట ఎలా ఉంది..? (video)