ట్విట్టర్ ట్రెండింగ్‌లో #SarileruNeekevvaruTeaser..

సెల్వి| Last Updated: శనివారం, 16 నవంబరు 2019 (14:58 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు విడుదల అయ్యాయి. అయితే ఈ సినిమా టీజర్‌, స్పెషల్‌ వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనిల్‌ రావిపూడి శనివారం ఉదయం టీజర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. అందులో మహేశ్‌ గన్‌ ట్రిగ్గింగ్‌ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ..'టీజర్‌ లోడింగ్‌' అని అనిల్‌ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే అతి త్వరలోనే 'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియోను పంచుకున్న అతి తక్కువ సమయం నుంచే అది సోషల్‌మీడియాలో దూకుసుపోతుంది. #SarileruNeekevvaruTeaser అనే హ్యాష్‌ట్యాగ్‌ వరల్డ్‌ వైడ్‌ ట్రెండింగ్‌ అవుతోంది. మరోవైపు హైదరాబాద్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో 1, 3, 4, స్థానాలు మహేశ్‌కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లతో ఉన్నాయి.

ఇదిలా ఉంటే... సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పాటు బన్నీ అలా వైకుంఠపురంలో సినిమ కూడా వుంది. ఇప్పటికే బన్నీ సినిమా పాటలు, టీజర్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాములో రాములా అంటూ అదరగొడుతోంది. మరి సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురంలో సినిమాల మధ్య మంచి వారే వుంటుందని టాక్ వస్తోంది.దీనిపై మరింత చదవండి :