గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:38 IST)

కరీనాకు అంత సీన్లేదు... "చెన్నై ఎక్స్‌ప్రెస్"లో షారుక్‌తో దీపికా పదుకునె..?!!

ఇదిగో తోక అంటే అదిగో పులి అనడం ఇప్పుడు చాలామంది పనిగా ఉందని బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి అన్నారు. ఇంతకీ ఆయన ఈ సామెత ఎందుకు గుర్తు చేసుకున్నారయా అంటే... తన తదుపరి చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారుక్ ఖాన్‌ను హీరోగా బుక్ చేశాడు. హీరోయిన్ కోసం తెగ వెతుకుతున్నాడు. 

ఇంతలో పలు పత్రికలు చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారుక్ సరసన కరీనా కపూర్ నటిస్తోందనీ, సంతకం కూడా చేసిందని రాసి పారేశారు. దీనిపై షెట్టి స్పందిస్తూ... అసలు తను కరీనాను ఇంతవరకూ అడగనే లేదనీ, అసలు ఆమెను ఈ చిత్రంలో నటింపజేయాలన్న ఉద్దేశ్యం కూడా లేదని అన్నాడు. తనకు ఆ ఉద్దేశ్యం లేనపుడు ఈ గాసిపర్లు ఎందుకు మరీ ఇలా రాసుకుంటారో తనకైతే అర్థం కావడం లేదన్నారు.

షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకునెను నటింపజేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఓం శాంతి ఓం చిత్రంలో వారి జంట కన్నులకింపుగా ఉందనీ, అందువల్లనే మళ్లీ అదే జంటను తన చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో నటింపజేయాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.