శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (18:15 IST)

`దేవినేని` సినిమా ఎలా వుందంటే!

Devineni still
నటీనటులుః
నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార, బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి, తుమ్మల పల్లి రామ సత్యనారాయణ , బాక్స్ ఆఫీస్ చందు రమేష్, లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు
 
సాంకేతిక నిపుణులు
ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్‌, నిర్మాతలుః జిఎస్ఆర్, రాము రాథోడ్డై, డైరెక్టర్ :-నర్రా శివనాగు, లిరిక్ రైటర్ :- మల్లిక్,
 
ఆమ‌ధ్య వంగ‌వీటి సినిమాను తీసిన వ‌ర్మ ఆ సినిమా నిజ‌జీవిత ఆధారంగా తీశాన‌ని చెప్పినా కొంత‌మేర క‌ల్పితం చేశాడు. ఇప్పుడు తాజాగా దేవినేని పేరుతో శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చింది. ఒక‌ర‌కంగా పొలిటిక‌ల్ సినిమా అంటే సాహ‌సంతో కూడుకున్న‌దే. కానీ ఎవ‌రినీనొప్పించ‌కుండా తీయ‌డం పెద్ద స‌వాల్‌. ఈరోజే విడుద‌లైన ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
ఇందులో నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం) అనేది ట్యాగ్ లైన్.
 
కథ:
బెజవాడలో అప్పట్లో చలసాని వెంకటరత్నం ( ప్రసన్న కుమార్ ) కమ్యూనిస్ట్ నాయకుడు. అందరిని న్యాయం చేయాలనీ భావించే వ్యక్తి. ఆయనకు శిష్యుడిగా పిలువబడుతున్న వంగవీటి రాధా ( బెనర్జీ ) కి మ‌ధ్య ఆటోలు, కారు ర‌వాణా విషయంలో విభేదాలు తలెత్తుతాయి. ఈ విభేదాల వల్ల చలసాని వెంకటరత్నం హత్య కు గురవుతాడు. చలసానిని చంపింది వంగవీటి రాధా అన్న ఆరోపణలు వస్తాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను హత్య చేయాలనీ పధకం వేసి ఆయనను అంతం చేస్తారు. వంగవీటి రాధా హత్యతో బెజవాడ మొత్తం హడలిపోతుంది. ఈ హత్య రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో అని ప్ర‌జ‌లు భావిస్తుంటారు. మ‌రోవైపు వంగవీటి రాధా తమ్ముడు రంగ (సురేష్ కొండేటి ), దేవినేని నెహ్రు (నందమూరి తారకరత్న) మిత్రులు. రాధా హత్యతో అక్కడి రాజకీయాలు తారుమారవుతాయ్. ఈ నేపథ్యంలో రంగ, నెహ్రు ల మధ్య కూడా శత్రుత్వం పెరుగుతుంది. మరి ఈ శత్రుత్వం ఎక్కడిదగా వెళ్ళింది ? అసలు రంగాని చంపింది ఎవరు ? అన్నది మిగతా కథ.
 
 
విశ్లేషణ:
 
ఈ సినిమా విషయంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి మ్యూజిక్, రీరికార్డింగ్‌, ఫోటోగ్రఫి. ఈ రెండు విభాగాలు ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయని చెప్పాలి. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇచ్చిన ఆర్ ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాలోని చాలా సన్నివేశాలు ఆర్ ఆర్ తో మరో స్థాయిలో ఉన్నాయి. ఇక ఫోటోగ్రఫి గురించి ఎంత చెప్పిన తక్కువ. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసాడు. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు శివనాగు కథపై హోంవ‌ర్క్ చేశాడ‌నే చెప్పాలి. అయినా ప్ర‌జ‌ల‌కు చేరాలంటే కాస్త సినిమాటిక్ ప్ర‌వేశ‌పెట్టాలి. ఆ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాడు. ఎవ‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూసుకున్నాడు. అయితే న‌టీన‌టుల న‌ట‌న విష‌యంలో కొంచెం శ్ర‌ద్ధ పెట్టాల్సింది. అది కాస్త చేసుంటే వ‌ర్మ త‌ర‌హా సినిమాగా వుండేది. రెండు కుటుంబాల నేపధ్యాన్ని బాగా ప్రజెంట్ చేసాడు.. ఇందులో కొంత తేడా జరిగిన కథ మొత్తం మరో కోణంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో దర్హకుడు జాగ్రత్త పడ్డాడు.
దేవినేని నెహ్రు పాత్రలో నందమూరి తరకరత్న, దేవినేని మురళి పాత్రలో అర్జున్ తేజ, చలసాని పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, వంగవీటి రాధ పాత్రలో సీనియర్ నటుడు బెబర్జి, వంగవీటి రంగా పాత్రలో సంతోషం సురేష్, రత్నకుమారి పాత్రలో తనుష్క రెడ్డి, సుబ్బు పాత్రలో లక్ష్మీ నివాస్, సిపిఐ లీడర్ పాత్రలో బాక్స్ ఆఫిస్ రమేష్ అద్భుతంగా నటించారు. ఈ పాత్రలు చూస్తుంటే ఆనాడు బెజవాడలో జరిగిన చరిత్ర కనిపిస్తుంది. ఒక 30 ఏళ్లు వెనక్కు వెళ్లినట్లు ఉంది.
 
వంగవీటి అభిమానుల గాని దేవినేని అభిమానులు గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు. ఒకసారి మీరు సినిమా చూడండి. సినిమాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలపండి వెంటనే వాటిని కరెక్షన్ చేస్తాము అని దర్శకుడు పదే పడే చెప్పినట్టే ఈ సినిమాలో రెండు కుటుంబాలకు చెందిన సమస్యలను చక్కగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అమ్మ‌మ్మ‌గారి మ‌న‌వడు వంటి సినిమాలేకాదు రాజ‌కీయ నేప‌థ్యంలో సినిమా కూడా తీయ‌గ‌ల స‌త్తా వుంద‌ని నిరూపించుకున్నాడు ద‌ర్శ‌కుడు.  నందమూరి తారకరత్న బాగా సూట‌య్యాడు. కొన్ని చిన్న‌పాటి లోపాటున్నా మొత్తంగా ఒక్కాసి విజ‌య‌వాడ‌వారిని వెన‌క చ‌రిత్ర‌లోకి తీసుకువెళ్ళాడు.