సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (12:49 IST)

#Nartanasala Movie review.. ట్విట్టర్ టాక్ ఇదే

''ఛలో'' సినిమాతో హిట్ కొట్టిన కుర్రహీరో నాగశౌర్య.. తాజాగా ''నర్తనశాల'' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాశ్మీర, యామిని హీరోయిన్స్‌గా నటించారు. ఈ సిన

''ఛలో'' సినిమాతో హిట్ కొట్టిన కుర్రహీరో నాగశౌర్య.. తాజాగా ''నర్తనశాల'' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాశ్మీర, యామిని హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాపై ప్రేక్షకులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకుల ట్వీట్ల ప్రకారం.. హీరో నాగశౌర్య నటనపరంగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. 
 
కామెడీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినప్పటికీ.. ఆ కామెడీ ట్రాక్ సరిగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. అవసరం లేని చోట కామెడీ‌ని బలవంతంగా ఇరికించినట్లుగా ఉందని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు. శివాజీ రాజా కామెడీ కూడా చాలా ఓవర్‌గా ఉంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండ్ ఆఫ్ బెటర్ గా ఉంది అంటూ ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు.
 
ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్ర కనిపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఊహలు గుసగుస లాడే సినిమాతో తెరంగేట్రం చేసిన నాగశౌర్య.. ఛలో హిట్ తర్వా అట్‌నర్తనశాలలో నటించారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా మొదలైంది. శివాజీ రాజా కుమార్తె కావాలనుకుంటాడు. కానీ కుమారుడు పుడతాడు. కొడుకునే అమ్మాయిలా పెంచుకుంటాడు. 
 
పెద్దయ్యాక మహిళల సంక్షేమం కోసం పాటుపడుతుంటాడు. నాన్న పెంచిన విధానంలో.. మహిళలతో స్నేహం చేస్తాడు. తద్వారా గే క్యారెక్టర్‌లో కనిపించాడు. ఈ క్యారెక్టర్‌లో వుండే కొత్తదనం కథలో లేకపోవడం, దర్శకుడు కథను తెరకెక్కే విధానం సరిగ్గా లేకపోవడం ద్వారా సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని సినీ పండితులు అంటున్నారు.