శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (10:42 IST)

ఆహ్లాదరమైన గ్రామీణ ప్రేమకథ గా ఐ హేట్ లవ్ రివ్యూ

Subbu, rivalli
Subbu, rivalli
సుబ్బు, శ్రీవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’.  డా॥ బాల రావి (యు.ఎస్‌.ఏ) నిర్మించిన ఈ చిత్రం వెంకటేష్‌ వి.దర్శకత్వంలో రూపొందింది. శుక్రవారమే విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇన్నర్ గా యూత్ కి ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
 
కథ: 
రాంబాబు(సుబ్బు) పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. అమ్మాయిలంటే అస్సలు గిట్టదు. అలాంటి సిద్ధూ  సీత(శ్రీవల్లి)ని ఒక సందర్భంలో చూసి ప్రేమలో పడతాడు. అయితే... వీరి ప్రేమను తల్లిదండ్రులు మాత్రం అంగీకరించరు. దాంతో వీరిద్దరూ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి ఇద్దరూ బైక్ లో వెళుతుండగా... అదే గ్రామానికి చెందిన వీరబాబు అనే పత్రికా విలేకరి... వీరిద్దరి ఫొటోని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తాడు. దాంతో వీరిద్దరి ప్రేమకు మరింత ప్రతి బంధకం ఏర్పడుతుంది. దాంతో రాంబాబు, సీత తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశారు? మొదట్లో రాంబాబుకి అమ్మాయిలంటే ఎందుకు గిట్టదు? ఎంతో స్నేహంగా ఉన్న రాంబాబు, సీత కుటంబాలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 
సమీక్ష:
గ్రామీణ ప్రేమకథలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కోనసీమలాంటి గ్రామాల్లో తెరకెక్కిన ప్రేమకథలు బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో కాస్త ఫన్, మెచ్యురిటీ ఉండటంతో ఆడియన్స్ కూడా ఇట్టే కనెక్ట్ అవుతారు. తాజాగా తెరకెక్కిన ‘ఐ హేట్ లవ్’ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో హీరో రగ్ డ్ లుక్ లో ... హీరోయిన్ గ్రామీణ యువతిగా పక్కింటి అమ్మాయిలా చాలా సౌమ్యంగా కనిపించే లుక్... ఇద్దరి మధ్య లవ్ పుడితే... వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే దాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. 
 
గ్రిప్పింగ్ కథ.. కథనాలతో ఎక్కడా బోరింగ్, వల్గారిటీ లేకుండా సినిమాని ఫ్యామిలీతో చూసేలా తెరకెక్కించారు. కోనసీమలో సాధారణంగా మాట్లాడుకునే భాషలో చాలా సరదా సంభాషణలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. తన ఇంట్లో జరిగిన ఓ సంఘటనతో మొదట్లో హీరోకి అమ్మాయిలంటే గిట్టకపోవడం.  అది ఎంతో కాలం అబ్బాయిల్లో ఉండదని... ఆ తరువాత ఏదో ఒక టైంలో అమ్మాయిలను ఇష్టపడాల్సిందే అనే కోణంలో యూత్ మనస్తత్వాలు ఎలా ఉంటాయనేదాన్ని దర్శకుడు చాలా మెచ్యూర్ గా చూపించారు. 
 
ఇక సోషల్ మీడియాను అనవసర విషయాలకు ఉపయోగిస్తే.. దానివల్ల ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో అనేదాన్ని చూపించి... ఏదైనా చేసే ముందుకు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలనే దాన్ని ఇన్నర్ మెసేజ్ గా ఇచ్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఫెరోషియస్ నెస్... ఆ తరువాత అమ్మాయి ప్రేమలో పడటంతో ఇంటర్వల్ కార్డు వేసి... ఆ తరువాత ప్రేమను దక్కించుకోవడానికి హీరో, హీరోయిన్లు పడే తపనను చూపించి మెప్పించారు. చిన్న చిన్న లోపాలున్నా  ‘ఐ హేట్ లవ్’... యూత్ చూడదగ్గ సినిమా. 
 
హీరో సుబ్బు నిజయతీ గల ప్రేమికునిగా... రెండు వేరియషన్స్ లోనూ బాగా పరిణితి కనబరచారు. అలాగే అతనికి జోడీగా నటించిన శ్రీవల్లి కూడా గ్రామీణ యువతి పాత్రలో మెప్పించింది. మనసు నిండా ప్రేమను నింపుకుని... తల్లిదండ్రుల మాట కోసం ఆ ప్రేమను త్యాగం చేయడానికి సిద్దపడే సౌమ్యంగా ఉండే సగటు గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయి నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే వీరిద్దరికి తల్లిదండ్రులగా నటించిన నటులు కూడా మెప్పించారు. విలన్ మణి పాత్రలో నటించిన నటుడు బాగానే చేశారు. అలాగే విలేకరి పాత్రలో చేసిన నటుడు కూడా బాగానే చేశారు. హీరో స్నేహితునిగా నటించిన కుర్రాడు పర్వాలేదు అనిపించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
 
దర్శకుడు వెంకటేశ్ వి రాసుకున్న ప్రేమకథ బాగుంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకుల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది. దాన్ని పొందడానికి వాళ్లు పడే పాట్లన్నీ ఇందులో చూపించారు. ఈ సినిమాకి సంగీతం ప్లస్ అయింది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సినిమా మరింత బాగుండేది. నేపథ్య సంగీతం బాగుంది. కోనసీమ గ్రామీణ ప్రాంతాల అందాలను సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించారు. గ్రామీణ అందాలు బాగా ఒడిసిపట్టి... తెరపై చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాత డా॥ బాల రావి (యు.ఎస్‌.ఏ) ఎక్కడా రాజీపడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు.  
రేటింగ్: 2.75/5