నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, కథ: మురళీ గోపి, నిర్మాతలు: ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్, దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్, మ్యూజిక్: దీపక్ దేవ్.
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ `ఎల్ 2 ఎంపురాన్`. 2019లో వచ్చిన `లూసిఫర్`కిది సీక్వెల్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సక్సెస్ అయింది. తెలుగులో చిరంజీవి దీన్ని `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేశారు. నేడు గురువారం (మార్చి 27) ఈ చిత్రం విడుదలయ్యింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
గుజరాత్ లో హిందూ, ముస్లింల అల్లర్లు ఊచకోతలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి రాజ్యపాలన చేస్తాడు అభిమన్యు సింగ్. ఇక కేరళలో జతిన్ రామ్‌దాస్ (టొవిన్ థామస్) తన తండ్రి పీకేఆర్ (సచిన్ ఖేడ్కర్) స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి అభిమన్యు సింగ్ అండతో సొంత పార్టీ పెడతాడు. జతిన్ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులతోపాటు అతని సోదరి ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్) కు షాక్ కు గురిచేస్తుంది.
మరోవైపు స్టీఫెన్ (మోహన్ లాల్) లూసిఫర్ కథలోనే విదేశాలకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి మాఫియా డాన్ గా రారాజుగా (ఎంపురాన్) గా ఎదుగుతాడు. ఇక తన తండ్రి పార్టీని నిలబెట్టాలని ప్రియదర్శిని ప్రయత్నించే క్రమంలో ఆమెపై ఎటాక్ జరుగుతుంది. సరిగ్గా ఆ టైంలో స్టీఫెన్ వచ్చి కాపాడతాడు. స్టీఫెన్ ఎందుకు కాపాడాడు? జితిన్ ఏం చేశాడు? ప్రధ్వీరాజ్ సుకుమార్ కథేమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
L2: ఎంపురాన్ సినిమా యాక్షన్, ఎమోషన్స్, పాలిటిక్స్ మిళితం చేసి రూపొందించిన చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయ ముఖచిత్రం కనిపిస్తుంది. వారసులు రాజకీయాల్లోకి వస్తే మంచి, చెడులు ఎలా వుంటాయనేది చెప్పాడు. మోహన్ లాల్ భాగమంతా స్లయిలిష్ గా వుంటుంది. బిల్డప్ షాట్స్ ఎక్కువగా వుంటాయి. ఇందులో మూడు కథలున్నాయి. వాటిని లింక్ చేసే విషయంలో క్రమంలో కాస్త ఇంగ్లీషు సినిమా చూసిన ఫీలింగ్ తో కాస్త గందరగోళం కూడా అనిపిస్తుంది. కేవలం పృథ్వీరాజ్ పాత్ర కోసం ఆయా సీన్లు పెట్టినట్టుగా ఉంది. అలాగే డైలాగులు పెద్ద మైనస్. క్రిస్టియన్ పదాలను ఒరిజినల్‌గా ట్రాన్స్ లేట్ చేయడంతో సహజత్వం మిస్ అయ్యింది.
చెడును అరికట్టడానికి దేవుడు దూతతో వచ్చినట్లే జీసెస్ కూడా అలానే ఫాలో అవుతూ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలుంటాయి. విదేశాల్లో జరిగే సీన్లు, లోకల్ పాలిటిక్స్ కి లింక్ చేసే సీన్లు కూడా కొంత కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. కథ, కథనాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియెన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. లెంగ్త్ ఈ సినిమాకు కొంత మైనస్. ఇరాక్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో మొదలై ఆసక్తిని కలిగిస్తుంది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో జరిగిన మతకల్లోల ఎపిపోడ్ హృదయాన్ని పిండేసేలా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించాడు. సుదీర్ఘంగా ఎపిసోడ్‌తో దర్శకుడిగా తాను ఏం చెప్పబోతున్నాడో భారీ హింట్ ఇచ్చాడు. కానీ ఫస్టాఫ్‌ను సాగదీసి.. ఓ దశలో సహనానికి పరీక్ష పెట్టేలా చేశాడు.
అధికారం ఇస్తే అవినీతికి అరాచకాలకు పాల్పడతారు. పూర్తి అధికారం ఇస్తే మరింత లా రెచ్చిపోతారు. ఓ రాజకీయవేత్త సూక్తి ఆధారంగా కథనురాసుకున్నట్లు తెలుస్తోంది. వారసత్వం రాజకీయాలు, పదవి కోసం గొడవలు రొటీన్‌గా ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ చుట్టే స్టీఫెన్ అలియాస్ ఖురేషి పాత్ర తిరుగుతుంది. బలమైన, కొత్త పాయింటేమీ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. ఇక పార్ట్ 3 కోసం మంచి ఎలివేషన్ ఎపిసోడ్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడనపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. అందరూ బాగానే నటించారనే చెప్పాలి. లూసిఫర్` మూవీ చాలా వరకు స్థానిక రాజకీయాలపై సాగుతుంది. కనెక్టివిటీ ఉంది. కానీ `ఎల్2 ఎంపురాన్`లో మాత్రం మోహన్‌లాల్ పాత్ర విదేశాల్లోనే ఉంటుంది. ఆయన ఎందుకు పోరాడుతున్నాడు? దేనికోసం పోరాడుతున్నాడనేది క్లారిటీ లేదు. యాక్ష న్ సన్నివేశాలు ఈమధ్య బాలయ్య సినిమాల్లో వుండే ఊచకోతకు మించి వుంటుంది. కానీ రియాలిటీకి దగ్గరగా సినిమా కథని నడిపిస్తే బాగుండేది. సరళమైన కథనంతో సినిమాని నడిపిస్తే బాగుండేది. కానీ స్టయిలీష్ టేకింగ్ బాగుంది. ఆడియెన్స్ అది మాత్రమే సరిపోదు.
ఈ సినిమాకి దీపక్ దేవ్ సంగీతం అందించారు. ముఖ్యంగా బీజీఎం బాగుంది. యాక్షన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోప్ ఆకట్టుకుంది. ఎడిటర్ అఖిలేష్ మోహన్ ఓకే అనిపించారు. ఇంకా క్లారిటీగా ట్రిమ్ చేయాల్సింది. కథనాన్ని స్పీడ్‌గా చేయాల్సింది. సుజీత్ వాసుదేవ్ కెమెరా వర్క్ బాగుంది. లావిష్ విజువల్స్ కనువిందు చేసేలా ఉన్నాయి. డైలాగుల విషయంలో తెలుగుకు అనుగుణంగా కేర్ తీసుకోవాల్సింది.
రేటింగ్: 2.5/5