గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By దేవి
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (13:49 IST)

స్క్రీన్ ప్లే కొత్తగా సైకో థ్రిల్లర్ నేపధ్యంలో ఆర్టిస్ట్ చిత్రం :సంతోష్ కల్వచెర్ల

Santosh Kalvacherla, Krisheka Patel
Santosh Kalvacherla, Krisheka Patel
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ - "ఆర్టిస్ట్" మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రతన్ రిషి గారికి థ్యాంక్స్. అలాగే హీరో సంతోష్ బయట మామూలుగా కనిపిస్తాడు గానీ కెమెరా ముందుకు వచ్చాక ఆయన పర్ ఫార్మెన్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ గారు మూవీ మీద ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. టైటిల్ కూడా ఆర్టిస్ట్ అని పెట్టారు. సురేష్ బొబ్బిలి బీజీఎం వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుంది. సినిమా మేము చూశాం సూపర్బ్ గా వచ్చింది. మంచి డేట్ కు ఈ నెల 21న రిలీజ్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ - ఒక ఫిల్మ్ చేసి రిలీజ్ కు తీసుకురావడం సులువైన విషయం కాదు. ఎంతోమంది కృషి దీని వెనక ఉంటుంది. మా  "ఆర్టిస్ట్" టీమ్ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యూఎస్ నుంచి ఈ మూవీ కోసం ఎన్నోసార్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది నా కోరిక. అందుకే మా సంస్థలో న్యూ కమర్స్ తో మూవీస్ చేస్తున్నాం. ఇది మా సంస్థలో రెండో మూవీ. ఫ్యూచర్ లోనూ మూవీస్ చేస్తాం. డైరెక్టర్ రతన్ రిషి "ఆర్టిస్ట్" మూవీతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే హీరో సంతోష్, హీరోయిన్ క్రిషేకకు కూడా పేరొస్తుంది. మా మూవీ సాంగ్స్ టీ సిరీస్ ద్వారా రిలీజై ఆదరణ పొందుతున్నాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. వాళ్లకు సినిమా నచ్చి రిలీజ్ చేస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. సొసైటీకి కావాల్సిన మంచి కంటెంట్ తో సినిమా చేశాం. ఈ నెల 21న థియేటర్స్ లో "ఆర్టిస్ట్" సినిమా చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
 
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ,  మా డైరెక్టర్. సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ ను చూపించాడు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. సినిమా చూశాను. ఆ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. "ఆర్టిస్ట్" సినిమా చూశాక ఎవరూ రొటీన్ గా ఉందని అనరు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉందని అంటారు. మా డైరెక్టర్ సజెస్ట్ చేసినట్లు నటించాను. ఆయన ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనేది ప్యాషన్. ఆయన ఈ బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, వినయ్ వర్మ లాంటి వాళ్లతో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నెల 21న థియేటర్స్ లో "ఆర్టిస్ట్" చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
డైరెక్టర్ రతన్ రిషి మాట్లాడుతూ, ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయి. ఒక ఎమోషన్ మీద కథ వెళ్తుంటుంది. సినిమా చివరి 20 నిమిషాలు హై ఉంటుంది. చివరకు ఒక మంచి ఫీల్ తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. కథలోని ఎమోషన్ కు తగినట్లే సురేష్ బొబ్బిలి ఒక కొత్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. ట్రైలర్ లో వయలెన్స్ ఎక్కువగా ఉందని మీకు అనిపించవచ్చు. మూవీలో ఇంత వయలెన్స్ లేదని మా టీమ్ అన్నారు. సైకో థ్రిల్లర్స్ అంటే హత్య జరిగిన తర్వాత కిల్లర్ ఎవరనేది వెతుక్కుంటూ కథ సాగుతుంది. కానీ మా మూవీలో విలన్ ఎవరో చెప్పే మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశాం అన్నారు.