1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:09 IST)

బజార్ రౌడీ- నా జర్నీ కి మరో మెట్టు అవుతుందిః సంపూర్ణేష్ బాబు

Bazaar Rowdy team
బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా లోరాని, మహేశ్వరి హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం బజార్ రౌడీ.ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్సకత్వం వహిస్తున్నారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 20న 300 థియేటర్స్ లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు క్లీన్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది.
 
ఈ సందర్భంగా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయ్ కుమార్ అద్భుతమైన  సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు. 
 
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, సింగం 123, వైరస్ తరువాత నేను చేస్తున్న 5 వ సినిమా బజార్ రౌడీ . సంపూర్ణేష్ గా హృదయ కాలేయం సినిమా ద్వారా రాజేష్ గారు నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే బజార్ రౌడీ చిత్రం ఒక ఎత్తు. ఈ సినిమా నా జర్నీ కి మరో మెట్టు అవుతుంది.. ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా కాస్తా అలస్యమైంది. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ లతో నటించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను. కెమెరా మెన్ శ్రీనివాస్ గారికి ఆయన కెరియర్ లో నా సినిమానే చిన్న సినిమా అయ్యి ఉంటుంది.ఈ సినిమా ఇంతదూరం రావడానికి నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు.నాకింత మంచి అవకాశం. కల్పించిన మా నిర్మాతకు వేదిక మీదే పాదాభివందనం చేస్తున్నాను.గత చిత్రాల మాదిరే ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
హీరోయిన్ మహేశ్వరి మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.నేను హీరోయిన్ గా ఇంతదూరం రావడానికి కారణమైన నా తల్లితండ్రులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు సినిమా ఇన్ని థియేటర్స్ లలో విడుదల  అవుతుంది అంటే కేవలం ప్రొడ్యూసర్ ఫ్యాషన్ మాత్రమే .నిర్మాత వయసులో ఎంతో  పెద్ద వారైనా ప్యాసినెట్ తో 24 క్రాఫ్ట్స్ దగ్గరుండి చూసుకున్నారు అన్నారు. 
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ మాట్లాడుతూ.. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించడానికి ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంపూ గారి కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ .చిత్ర యూనిట్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా పని చేశారు. నిర్మాత  వ్యవసాయదారుడైనా కూడా సినిమా పై ఉన్న ఫ్యాషన్ తో సినిమా బాగా రావాలని దగ్గరుండి అన్ని విభాగాలను హ్యాండిల్ చేస్తూ  ఖర్చుకు వెనుకడకుండా  చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. సంపూర్ణేష్ బాబు ను హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, ల కాకుండా నేను మరో యాంగిల్ లో చూపించాను. ప్రేక్షకులందరూ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది అన్నారు.