ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (16:46 IST)

చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంధ‌ర్బంగా బ‌జార్ రౌడి-విడుద‌ల‌

Sampoornesh Babu
హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి  కామెడి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమాని సీనియ‌ర్  ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని  సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబుకి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు. 
 
ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్ మీద త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని చూపించారు, ఈ చిత్రానికి సీనియర్ రైటర్ మరుధూరి రాజా మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు చాలా బాగా కుదించారు.  SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు 20 న మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంధ‌ర్బంగా విడుద‌ల చేస్తున్నారు..
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ఈ చిత్ర క‌థ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,ష‌ఫి, స‌మీర్ లాంటి పెద్ద న‌టీన‌టుల‌తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాము. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది అన్నారు
 
ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ, హ్రుద‌యాల్లో వున్న సంపూని ఇలాంటి ప‌క్కా క‌మ‌ర్షియల్ క‌థ‌లోని ఆయ‌న స్టైల్ ని యాడ్ చేసి తెర‌కెక్కించాము. ప్రేక్ష‌కుల కి న‌వ్వులు, పాట‌లు, ఫైట్స్ కిక్కిచ్చే అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని అంద‌రి స‌హ‌యస‌హ‌కారాలతొ ఈ చిత్రాన్ని పూర్తిచేసాము. ఇటీవలే మా మోద‌టి కాపి చూసిన నిర్మాత చాలా ఆనందంగా వున్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ,పెద్ద చిత్రాల‌కి ధీటుగా ఈ చిత్రాన్ని ఈ అగ‌ష్టు లో ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నామని అన్నారు.