సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:40 IST)

జిమ్‌లో చిరును కలిసిన ప్రకాష్ రాజ్ - చిత్ర పరిశ్రమకు ఓ వరమంటూ..

మెగాస్టార్ చిరంజీవిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి చిత్ర పరిశ్రమకు ఓ వరం అంటూ కితాబిచ్చారు. అదేసమయంలో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతున్న చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల ఓ తమిళ చిత్రంలో గాయపడిన హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రకాష్ రాజ్... చిరంజీవిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చిరంజీవి చూపుతోన్న చొర‌వ ప‌ట్ల ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.
 
'ఉద‌యాన్నే బాస్‌తో జిమ్‌లో స‌మావేశ‌మ‌య్యాను. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతోన్న చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను. అన్న‌య్య మాకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. ఓ వ‌రంలా సినీ ప‌రిశ్ర‌మ‌లో మాకు ఇటువంటి వ్య‌క్తి ఉన్నారు' అని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు. 
 
కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రకాశ్ రాజుకు నాగబాబు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. త‌మ‌కు చిరంజీవి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయ‌ని నాగ‌బాబు చెప్పారు.