సంబంధిత వార్తలు
- Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే
- Payal: ఆరోగ్యం బాగుంది - పంజాబీ, తమిళ చిత్రాల్లో బిజీ వల్లే తెలుగులో నటించడంలేదు : పాయల్
- Dhanush: ఒకప్పుటి బ్యాంకు దొంగ - కనికరం లేని పోలీస్ అధికారి కథే ధనుష్... కారా ట్రైలర్
- Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్
- Anushka: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రొజిన్ థామస్ తెరకెక్కించిన కథనార్ ట్రైలర్ విడుదల
Sunitha: గాయని సునీత తనయుడు ఆకాష్ కు కొత్త మలుపు అవుతుందా..
A. Kodandarami Reddy launched the 'Kotha Malupu' trailer
ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యశ్వంత్ నాగ్ అందించారు.
దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ఆశీర్వదించిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.
నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, “మా సినిమా బాగుందని బ్లెస్సింగ్ అందించిన ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇది నాకు తొలి సినిమా. దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్‌కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. కమెడియన్ మహేంద్ర సినిమా లో చేసిన కామెడీ హైలెట్ గా నిలుస్తుందని అన్నారు..
హీరో ఆకాష్ గోపరాజు మాట్లాడుతూ, ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
హీరోయిన్ భైరవి అర్ధ్యా మాట్లాడుతూ, “నా కెరీర్‌లో కొత్త మలుపు చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి” అని పేర్కొన్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల ప్రకారం, కొత్త మలుపు కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందింది. జూన్ 12న విడుదల కానున్న కొత్త మలుపు ప్రేక్షకులకు ప్రేమ, సస్పెన్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.
