శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (09:58 IST)

మీ వల్లే పార్టీ నాశనం.. కాదు పాలన వల్లే : వసుంధరా రాజే వర్సెస్ అమిత్ షా

రాజస్థాన్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో అగ్రనేతల మధ్య కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరినట్టు సమాచారం. మీ వల్లే పార్టీ నాశనం అయ్యిందంటూ అమిత్ షాను రాజే నిలదీయగా, కాదు మీ పాలన వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందంటూ రాజేకు అమిత్ షా కౌంటర్ వేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, ఈ ఎన్నికల కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాలకు ఎత్తులు పైఎత్తులు వేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. 2013 ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీ సాధించి రాజస్థాన్‌ పీఠం అధిరోహించిన రాజమాత వసుంధర రాజేకు ఈ సారి పరాజయం తప్పదని సర్వేలో తేలింది. మొత్తం 200 స్ధానాలున్న రాజస్ధాన్‌ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 142 స్ధానాల్లో విజయం సాధించే అవకాశాలుండగా బీజేపీ 56 స్ధానాలకే పరిమితం కానుందని ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వేలో తేల్చిచెప్పింది.
 
అయితే.. ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించనేలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధర రాజే అభ్యర్థుల జాబితాను తయారుచేసి అధిష్టానానికి పంపారు. అయితే ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే మళ్లీ సీఎం సీట్లు కేటాయించారు. ఈ జాబితాను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరస్కరించారు. ఇందుకు కారణం గ్రౌండ్ రిపోర్ట్‌ల ద్వారా జాబితాను సిద్ధం చేయలేదని షా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో రాజే - షా మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారంలో త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.