శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (14:54 IST)

బాలికలతో పోర్న్ వీడియోలు చూపించిన ప్రిన్సిపాల్ - టీచర్లు.. ఎక్కడ?

మంచిగా విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు కామంతో కళ్ళుమూసుకుని కీచకలుగా మారారు. తమ వద్ద చదువుకునే విద్యార్థినిలతో బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించారు. ఆ వీ

మంచిగా విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు కామంతో కళ్ళుమూసుకుని కీచకలుగా మారారు. తమ వద్ద చదువుకునే విద్యార్థినిలతో బలవంతంగా అశ్లీల చిత్రాలు చూపించారు. ఆ వీడియోలు చూడకుంటే ఫెయిల్ చేస్తామంటూ బెదిరించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బీహార్ లాల్‌బాగ్ ఏరియాలోని పబ్లిక్ పాఠశాలలో గత కొద్ది రోజుల నుంచి ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులు కలిసి.. విద్యార్థినులకు బలవంతంగా అశ్లీల దృశ్యాలు చూపిస్తున్నారు. ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. టీచర్ల వేధింపులు భరించలేని కొంతమంది విద్యార్థినిలు ధైర్యం చేసి తమ బాధను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
నిత్యం ప్రిన్సిపాల్, టీచర్లు వేధిస్తున్న వైనాన్ని వారు వివరించారు. దీంతో బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంబంధిత పాఠశాలను సీజ్ చేశారు. అయితే కేసు పెట్టే కంటే ముందే.. బాధిత విద్యార్థినులకు ప్రిన్సిపాల్ డబ్బు ఆశ చూపడం గమనార్హం.