శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (14:46 IST)

మోక్షం కోసం సామూహిక సూసైడ్స్.. ఆ లేఖలో ఏముందంటే...

దేశ రాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన ఘటన 11 మంది సామూహిక ఆత్మహత్యల ఘటన. మోక్షం కోసం వీరు ఇలా చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, ఈ సామూహిక ఆత్మహత్యలు జరిగిన బురారీ ఏరియాలోని భాటి

దేశ రాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన ఘటన 11 మంది సామూహిక ఆత్మహత్యల ఘటన. మోక్షం కోసం వీరు ఇలా చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, ఈ సామూహిక ఆత్మహత్యలు జరిగిన బురారీ ఏరియాలోని భాటియా ఫ్యామిలీ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
 
మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా? లేదా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు. 
 
చేతితో రాసిన లేఖలో ఉన్న కొన్ని అంశాలు ఇవి..
* చావు కోసం గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలని రాశారు..
* కండ్లను బట్టతో కట్టుకోవాలని, ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి..
* చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా కఠినంగా వాటిని నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి.
* ఒకవేళ వయసు మీరిన వాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్‌లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి.
* చాలా మసక మసక వెలుతురులో పని పూర్తి చేయాలి..
* చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి.
* నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి.
* ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి.. 
* రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకముందే చేయాలి.
* అందరిలోనూ ఒకేరకమైన ఆలోచనలు ఉండాలి. ఒకవేళ మీరు ఇలా చేస్తే..అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది అని రాసివుంచడం ఇపుడు చర్చనయాంశంగా మారింది.