సంబంధిత వార్తలు
- సఫారీ గడ్డ.. టీమిండియా అడ్డా: విరాట్ కోహ్లీ రికార్డుల పంట
- సెంచూరియన్ టెస్టులో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
- బుసలు కొడుతున్న ఒమిక్రాన్ వైరస్ - 961కి చేరిన పాజిటివ్ కేసులు
- రసవత్తరంగా సెంచూరియన్ టెస్ట్ : భారత్ 174 ఆలౌట్ - సఫారీల టార్గెట్ 305 రన్స్
- ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం : మహారాష్ట్రలో నమోదు!
దేశంలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన రోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశంలో నమోదైన తొలి మరణం. ఈ కేసు కూడా మహారాష్ట్రలో నమోదైంది. నైజీరియా నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ రాగా, ఆ రోగి మృతి చెందినట్టు వైద్యులువెల్లడించారు.
అయితే, అధికారులు మాత్రం ఈ మరణాన్ని ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరుతున్నారు. ఈ రోగికి ఇతర అనేక జబ్బులు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ యశ్వంత్ రావు చవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ రోగి ఈ నెల 28వ తేదీన మృతి చెందారు. ఈ రోగికి 13 యేళ్లుగా చక్కెర వ్యాధి వుంది. అలాగే, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అందువల్ల ఒమిక్రాన్ మరణంగా చూడొద్దని కోరారు.
