గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (08:38 IST)

అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులు శూన్యం : వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ద్వారా సంక్రమించిన హక్కుల కారణంగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు నోటిదూలను ప్రదర్శిస్తున్నారు. చరిత్రపై ఏమాత్రం అహగాన లేని వారిలా మాట్లాడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మనకు వచ్చిన హక్కులేమీ లేవన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వల్లే మనకు సంపూర్ణ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. 
 
తాడికొండ వైకాపా ఎమ్మెల్యేగా ఈమె కొనసాగుతున్నారు. గురువారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అంబేద్కర్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇందులో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ వల్ల మనకు వచ్చిందేమీ లేదన్నారు. ఆయన వల్ల మనకు వచ్చిన హక్కులు ఏమీ లేవన్నారు. 
 
బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మనకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. మరోవైపు, అంబేద్కర్ అభిమానులను ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.