1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2022 (19:19 IST)

నా మరణ దిన వేడుకలకు తప్పక విచ్చేయండి: బాపట్ల జిల్లా మాజీమంత్రి ఆహ్వానం

Paleti Rama rao
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
బాపట్ల జిల్లాకు చెందిన తెదేపా మాజీమంత్రి చేసిన ఓ పని ఇప్పుడు వైరల్‌గా మారింది. తన మరణ దిన వేడుకలకు రండి అంటూ ఓ ఆహ్వానపత్రాన్ని అచ్చువేయంచారు. ఆయన మరెవరో కాదు గతంలో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీమంత్రి పాలేటి రామారావు.
 
చీరాల పట్టణానికి చెందిన డాక్టర్ పాలేటి రామారావుకి ప్రస్తుతం 63 ఏళ్లు. 2034 సంవత్సరంలో తను చనిపోతానని అంచనా వేసుకుని ఈ మేరకు ఆయన మరణ దినం నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. పాలేటి రామారావు లేఖ కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.