మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:06 IST)

స్టవ్ లేకుండా కారుపై చపాతీ కాల్చిన మహిళ.. వీడియో వైరల్

వేసవికాలం దెబ్బకు దేశంలోని చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదేవిధంగా ఒడిశా కూడా ఎండలతో మండిపోతోంది. 
 
ఎంతలా అంటే స్టవ్ లేకుండా వంట చేసుకునేంతలా. ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి, ఒడిశాలోని సోనేపూర్‌లో ఒక మహిళ 40-డిగ్రీల ఎండలో కారు బానెట్‌పై చపాతీ కాల్చింది. 
 
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో రోడ్డుపై ఆమ్లెట్లు వేసిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.