శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (18:13 IST)

పులి వెంబడిస్తే.. ఎలా తప్పించుకున్నారంటే.. ముందు, వెనక్కి వెళ్లి? (video)

పులి వెంటబడితే తప్పించుకోలేమేమోగానీ, ఏదైనా వాహనంలో వెళ్తున్నప్పుడు పులి వెంబడిస్తే.. తప్పించుకోవడం కొంత వరకు సులభమే. అలా ఓ గ్రూపు వాహనం వెనకబడిన పులి బారి నుంచి తప్పించుకున్నారు. తమ వెంటబడిన పులి నుంచి అత్యంత చాకచక్యంగా వారు తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో ఓపెన్ టాప్ జీపులో సఫారి చేస్తున్న టూరిస్టులను ఓ పులి భయపెట్టింది. వారు వాహనంలో వెళ్తుండగా ఆ పులి వారి వెంట పడింది. 
 
అయితే వారు కొంత దూరం ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి తెలివిగా ఆ పులి బారి నుంచి తప్పించుకుని, అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.