1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

నూడుల్ ఇడ్లీలు

వంటకాలు శాకాహారం ఇడ్లీ రవ్వ ఉప్పు కరివేపాకు ఎండుమిర్చి ఉడకబెట్టిన నూడుల్స్ ఆవాలు నూనె పిండి ప్లేట్లు ఇడ్లీ కుక్కర్
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ రవ్వ... మూడు కప్పులు
ఉప్పు... సరిపడా
కరివేపాకు... కొద్దిగా
ఎండుమిర్చి... నాలుగు
ఉడకబెట్టిన నూడుల్స్... ఒక కప్పు
ఆవాలు.. ఒక టీస్పూన్
నూనె... రెండు టీస్పూన్లు

తయారీ విధానం :
ఇడ్లీ రవ్వ, ఉడకబెట్టిన నూడుల్స్, ఉప్పులను ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో పోసి ఇడ్లీ పాత్ర లేదా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిమీద సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

తరువాత నూనె వేడిచేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీలు ఉడికిన తరువాత దించి హాట్‌ప్యాక్‌లో వేసేముందు ఇడ్లీలమీద పైన తయారు చేసిన పోపును చల్లాలి. అంతే నూడుల్ ఇడ్లీలు తయారైనట్లే...!

టమోటో కెచప్ లేదా ఏదేని పచ్చడితో కలిపి వేడి వేడిగా తింటే ఈ నూడుల్ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఇంకా రాయలసీమ స్పెషల్ అయిన వేరుశెనగ పచ్చడితో వీటిని కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి