బీన్స్ తాళింపు
|
బీన్స్... పావుకేజీ
ఆవాలు... అర టీస్పూన్
వంటనూనె... ఒక టీస్పూన్
ఉప్పు... తగినంత
మిరపకాయలు... నాలుగు
మినపప్పు... ఒక టీస్పూన్
కొబ్బరి తురుము... రెండు టీస్పూన్లు
తయారీ విధానం:
మొదట బీన్స్‌ను పొడిపొడిగా చేసుకుని, కాసిన్ని నీళ్ళుపోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, మిరకాయలు వేసి పోపు పెట్టాలి.
తరువాత అందులోనే ఉడికించిన బీన్స్, ఉప్పు, కొబ్బరి తురుములను కలిపి కాసేపు వేయించాలి. అంతే ఘుమఘుమలాడే బీన్స్ తాళింపు సిద్ధమైనట్లే...! పీచు పదార్థాలు అధికంగా కలిగిన బీన్స్ ఆరోగ్యకరమైందన్న విషయం మనకందరికీ తెలిసిందే. బీన్స్‌ను అలాగే పచ్చిగా ఉన్నప్పుడే తినలేము కాబట్టి ఇలా తాళింపు చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది.
