వెజ్ పకోడి కూర
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ : 100 గ్రా
బీన్స్ : 100 గ్రా
బంగాళాదుంపలు : 100 గ్రా
శనగపిండి : 100 గ్రా
కారం : 1/2 టీ స్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి : నాలుగు
కొత్తిమీర : 1 కట్ట
ధనియాల పొడి : 1 టీ స్పూన్
పచ్చిమిర్చి : 5
నూనె : వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
ముందుగా కాయగూరల్ని నీటిలో శుభ్రం చేసి సన్నటి ముక్కలుగా తరగండి. ఈ ముక్కలకు శనగపిండి, కారం, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పకోడీల పిండిలా ముద్దగా కలపండి. కాగిన నూనెలో ఈ ముద్దని పకోడీల్లా వేసి వేయించండి.
బాణలిలో కాస్త నూనెవేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చిముక్కలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇందులోనే ధనియాల పొడి కలపండి. తరువాత సిద్ధంగా ఉన్న వెజ్ పకోడిల్ని వేసి కలియపెట్టి, కొద్దిసేపు వేయించి తీయండి. అంతే... వెజ్ పకోడి కూర రెడీ. దీనిని రైస్‌తో అరిగించవచ్చు.