వెరైటీ బటర్ మసాలా
కావలసిన పదార్థాలు :
క్యారెట్ - రెండు మధ్య సైజువి, టమోటాలు - రెండు పెద్దవి, పనీర్ - 100 గ్రాములు, బఠాణీలు - కప్పు, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - మూడు, గరం మసాలా పొడి - అర స్పూన్, ధనియాల పొడి - అర స్పూన్, జీలకర్ర పొడి - అర స్పూన్, ఉప్పు - తగినంత, పసుపు - పావు స్పూన్, పంచదార - టీస్పూన్, చింతపండు పులుసు - రెండు టీస్పూన్లు, ఎండు కారం - టీస్పూన్, క్రీమ్ - రెండు టీస్పూన్లు.
తయారు చేయు విధానం :
ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కోసి ఉడికించాలి. ఈ క్యారెట్ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, టమోటాలను మిక్సీలో వేసి నూరాలి. కొన్ని నీళ్లను కాచి అందులో పసుపు, ఉప్పులను వేయాలి. ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన పనీర్‌ను వేయాలి.
బాణాలిలో నూనె వేసి కాగాక, క్యారెట్ మిశ్రమాన్ని వేసి అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి వేయించాలి. ఇందులో ఉప్పు, పంచదార, క్రీమ్‌లను వేసి సన్నని మంటపై ఉంచాలి. పనీర్‌ను నీళ్లలోంచి తీసి ఇందులో వేయాలి. దీనితో పాటు బఠాణీలు కూడా వేయాలి. పనీర్ వేసిన నీళ్లను కూడా ఇందులో పోసుకోవచ్చు.
కూరలు, పనీర్ ఉడికేంత వరకు ఉంచి దించాలి. దీనిపై కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, రోటీ, నాన్, రైస్‌లకు ఇది చాలా రుచిగా ఉంటుంది.