బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 జూన్ 2014 (11:59 IST)

మహిళలూ.. మీ పొట్ట తగ్గాలా? అయితే ఈ ఫుడ్ తీసుకోండి

మహిళలూ.. మీ పొట్ట తగ్గాలా? అయితే ఈ ఫుడ్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం మానేయటం కన్నా...సరైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నిస్తే మీ పొట్ట తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గడంతో పాటు పొట్ట తగ్గాలంటే గ్రీన్ టీ తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పులు తాగితే చెడు కొల్లెస్టరాల్ స్థాయిలు తగ్గిస్తుంది
 
నిమ్మకాయను కూడా మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. నిమ్మలో ఉన్న విటమిన్ ఎసిడిటీని తగ్గించి మొండి రోగాలను దూరం చేస్తుంది. అలాగే ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ వుండాలి. ఇది విటమిన్ సిని కలిగివుండటంతో వింటర్ జలుబులను అరికడతాయి. తక్కువ కేలరీలు ఇందులో ఉండటంతో బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇదేవిధంగా కడుపు, బరువు తగ్గాలనుకునేవారు మీ రెగ్యులర్ డైట్‌లో అరటిపండు, కేరట్లు, బీట్ రూట్,  ఆకు కూరలు, పచ్చని కూరగాయలు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, ఓట్స్, కోడిగుడ్లు, చేపలు, కాటేజ్ ఛీజ్, గోంగూర వంటివి తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని  సరైన సమయానికి తీసుకుంటే ఊబకాయం దూరం కావడంతో పాటు మహిళలకు పొట్ట తగ్గుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.